Fri Mar 20 2026 00:48:46 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: దీక్ష విరమించిన ముఖ్యమంత్రి

రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కేంద్రం హరిస్తుందని, ఐఏఎస్ అధికారుల సమ్మెను లెఫ్టినెంట్ గవర్నర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మంత్రులు మంగళవారం దీక్ష విరమించారు. 9 రోజులుగా వారు ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో దీక్ష చేస్తున్నారు. ముఖ్యమంత్రి దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీక్ష కారణంగా ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో కూడా కేజ్రీవాల్ పాల్గొనలేదు. మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో దీక్ష చేయడంపై హైకోర్టు కూడా ముఖ్యమంత్రిని తప్పుపట్టింది. ఎట్టకేలకు ముఖ్యమంత్రి దీక్ష విరమించారు.
Next Story

