Thu Mar 19 2026 16:56:53 GMT+0530 (India Standard Time)
పులివెందులపై మాట నిలబెట్టుకున్నా

తన స్వంత నియోజకవర్గం కుప్పం కంటే ముందు పులివెందులకు నీరిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం కడపలో జరిగిన వనం-మనం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కడప జిల్లాను హార్టీకల్చర్ హబ్ గా మారుస్తామని ప్రకటించారు. రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని పేర్కొన్నారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమపై జగన్ మాట్లాడటం లేదని విమర్శించారు. హరితాంధ్ర ప్రదేశ్ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, అందరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.
Next Story

