జేసీయే అంతా చేశాడు.. అమరావతి భూ కుంభకోణంలో
అప్పటి గుంటూరు జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ల్యాండ్ పూలింగ్ అక్రమాలకు కారణమయ్యారని సీఐడీ ఆరోపించింది. ఈ మేరకు హైకోర్టుకు సమర్పించిన అఫడవిట్ లో పేర్కొంది. అప్పుడు [more]
అప్పటి గుంటూరు జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ల్యాండ్ పూలింగ్ అక్రమాలకు కారణమయ్యారని సీఐడీ ఆరోపించింది. ఈ మేరకు హైకోర్టుకు సమర్పించిన అఫడవిట్ లో పేర్కొంది. అప్పుడు [more]

అప్పటి గుంటూరు జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ల్యాండ్ పూలింగ్ అక్రమాలకు కారణమయ్యారని సీఐడీ ఆరోపించింది. ఈ మేరకు హైకోర్టుకు సమర్పించిన అఫడవిట్ లో పేర్కొంది. అప్పుడు గుంటూరు జేసీగా ఉన్న చెరుకూరి శ్రీధర్ అనధికారికంగా రాజధాని ప్రాంత రెవెన్యూ రికార్డులు తెప్పించుకున్నారని సీఐడీ ఆరోపించింది. రాజధాని గ్రామాలతో పాటు తుళ్లూురు, మంగళగిరి, తాడేపల్లి రెవెన్యూ రికార్డలును కూడా తెప్పించుకున్నారని పేర్కొంది. సాగులో ఉన్న భూములను కూడా కొనుగోలు చేశారని ఆరోపించింది. 2016లో జీవో 41 కొందరి ప్రయోజనాల కోసమే తెచ్చారని సీఐడీ పేర్కొంది. కృష్ణానది తీరానికి కూడా ఈ జీవోను వర్తింప చేసి అక్రమాలకు పాల్పడ్డారని తెలిపింది. మంత్రివర్గం ఆమోదం లేకుండానే జీవో 41 ను తెచ్చారని తెలిపింది. రైతులను భయపెట్టి అగ్రిమెంట్లు చేసుకుని పూలింగ్ ప్రయోజనాలు పొందిన తర్వాత కోట్లాది రూపాయలకు విక్రయించినట్లు సీీఐడీ అభియోగం మోపింది.

