Fri Feb 14 2025 01:15:39 GMT+0000 (Coordinated Universal Time)
ఆమంచి మెత్తబడ్డట్టేనా..?
తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్న ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పునరాలోచనలో పడ్డారు. నిన్న చంద్రబాబు దూతగా వచ్చిన [more]
తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్న ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పునరాలోచనలో పడ్డారు. నిన్న చంద్రబాబు దూతగా వచ్చిన [more]

తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్న ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పునరాలోచనలో పడ్డారు. నిన్న చంద్రబాబు దూతగా వచ్చిన శిద్ధా రాఘవరావు ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్టీని వీడొద్దని, సమస్యలు పరిష్కరించుకుందామని చంద్రాబాబు మాటగా ఆయన ఆమంచికి చెప్పారు. దీంతో నిన్న కార్యకర్తలతో పార్టీ మార్పు గురించి చర్చించిన ఆమంచి ఇవాళ కొంత మెత్తబడ్డారు. ఆయన మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవనున్నారు. పార్టీలో ఇబ్బందులు ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. మొత్తానికి ఆమంచి విషయంలో చంద్రబాబు మంత్రాంగం ఫలించినట్లే కనపడుతోంది.
Next Story