Sun Mar 15 2026 11:56:53 GMT+0530 (India Standard Time)
చింతమనేని వస్తున్నాడు
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈరోజు జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. చింతమనేని ప్రభాకర్ కు దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ లభించడంతో ఆయన [more]
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈరోజు జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. చింతమనేని ప్రభాకర్ కు దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ లభించడంతో ఆయన [more]

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈరోజు జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. చింతమనేని ప్రభాకర్ కు దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ లభించడంతో ఆయన జైలు నుంచి విడుదలవ్వనున్నారు. చింతమనేని ప్రభాకర్ పై దాదాపు 60కి పైగా కేసులు నమోదయ్యాయి. దాదాపు 70 రోజుల నుంచి చింతమనేని ప్రభాకర్ ఏలూరు జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఆయనకు ఒక కేసులో బెయిల్ వచ్చినా మరొక కేసులో అరెస్ట్ చేస్తుండంతో రెండు నెలలకు పైగానే చింతమనేని ప్రభాకర్ జైలు జీవితం గడిపారు. ఆయన జైలు నుంచి విడుదల ఈరోజు కానున్నారు. అయితే మరొక కేసులో చింతమనేనిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
Next Story