Sun Mar 22 2026 13:22:21 GMT+0530 (India Standard Time)
వైఎస్ ను దుర్మార్గుడు అంటారా..?

ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న వనపర్తిలో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి తీవ్రంగా ఖండించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కేసీఆర్ దుర్మార్గుడు అని వ్యాఖ్యానించడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కార్యక్రమం మొదలుపెట్టిన మహబూబ్ నగర్ కు ప్రాధాన్యత ఇచ్చేవారని గుర్తుచేశారు. కొంగర కలాన్ సభ మాదిరిగానే వనపర్తి టీఆర్ఎస్ సభ కూడా తుస్సుమందని ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడుకు అనుకూలంగా తాను పత్రికల్లో వ్యాసాలు రాసినట్లు కేసీఆర్ నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన సవాల్ చేశారు.
Next Story

