Thu Jan 29 2026 10:45:37 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వం సీరియస్ .. కందుకూరు ఘటనతో కఠిన నిర్ణయం
ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ కందుకూరు లో జరిగిన ఘటనపై ఆరా తీసినట్లు తెలిసింది.

అనుమతి తీసుకున్న దెవరు? ఎక్కడ సభకు అనుమతి తీసుకున్నారు? ఎక్కడ జరిపారు? నిర్వాహకులు ముందుజాగ్రత్త చర్యలు ఏం తీసుకున్నారు? పోలీసులు సభ అనుమతించిన చోటు కాకుండా వేరే చోటకు మారిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారన్న దానిపై ఉన్నతాధికారులు వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. అనుమతి తీసుకున్న నిర్వాహకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఢిల్లీ నుంచి సీఎం ఆరా...
అయితే ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ జరిగిన ఘటనపై ఆరా తీసినట్లు తెలిసింది. రేపు మధ్యాహ్నానికి జగన్ తాడేపల్లికి చేరుకుంటారని తెలిసింది. ప్రతిపక్ష నేత సభలో ఘటన జరిగినప్పటికీ ఎనిమిది మంది మరణించడంతో ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇకపై సభలకు అనుమతించేటప్పుడు రోడ్లపై కాకుండా బహిరంగ ప్రదేశాల్లో ఇచ్చేలా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.
Next Story

