Sun Feb 01 2026 14:15:10 GMT+0000 (Coordinated Universal Time)
ఏక్షణంలోనైనా బాబు బీజేపీతో

వైసీపీతో బీజేపీ కలుస్తుందని తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ ఆరోపించింది. వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ ఏ క్షణంలోనైనా కలుస్తుందని చెప్పారు. బీజేపీ లేకుండా చంద్రబాబు ఒంటరిగా గెలవలేరన్నారు. వచ్చేఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీచేస్తుందని, కాని చంద్రబాబుకు ఆ ధైర్యం లేదన్నారు. బీజేపీతో లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది చంద్రబాబేనని అంబటి రాంబాబు అన్నారు.
Next Story
