Mon Feb 02 2026 10:42:27 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్

అధికారులపై ఎమ్మెల్యేలు ఇష్టారీతిన వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇటీవల దురుసు ప్రవర్తనతో వివాదాల్లోకి ఎక్కిన టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, పెందుర్తి వెంకటేష్ లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బొల్లినేని రామారావు ఎయిర్ పోర్టులో అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. పెందుర్తి వెంకటేష్ అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. దీంతో వీరిపై చంద్రబాబు ఒకింత సీరియస్ అయ్యారు. పార్టీ ప్రతిష్ఠను దిగజార్చే వారిని వదులుకునేందుకు అయినా సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు.
Next Story

