Sun Mar 15 2026 21:30:02 GMT+0530 (India Standard Time)
మోసం చేయొద్దు... చంద్రబాబు వార్నింగ్

తెలుగుదేశం పార్టీ నేతలపై అధినేత చంద్రబాబు నాయకుడు సీరియస్ అయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా నేతల్లో సీరియస్ నెస్ కనిపించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకుల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు గట్టిగా తిడితే చులకన అవుతారని కొంచెం ఓపికతో ఉన్నానని, ఇక ఊరుకునే ప్రస్తకే లేదని స్పష్టం చేశారు. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్లక్షం చేశారని, సభ్యత్వ నమోదు మందకోడిగా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పనులు చేసి మెప్పు పొందాలి కానీ పార్టీని మోసం చేసి కాదని హెచ్చరించారు. నేతలకు వ్యక్తిగత పనులు ఉంటే ఎన్నికలు వాయిదా వేయరని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా సీరియస్ గా ఉండాలని గట్టిగా చెప్పారు.
Next Story

