Fri Mar 20 2026 23:04:19 GMT+0530 (India Standard Time)
సోమవారం బాబుకు కేంద్రం నుంచి నోటీసులు

బీజేపీ నేతలు పొలిటికల్ టెర్రరిస్టులుగా మారారని సినీ నటుడు శివాజి విమర్శించారు. ప్రజలతో కనెక్ట్ అయిన చంద్రబాబు నాయుడు కేంద్రం పక్కకు తప్పించడానికి సమయం చూసి జాతీయ పార్టీ పంజా విసిరిందని ఆరోపించారు. జాతీయ స్థాయికి చెందిన ఓ రాజ్యాంగబద్ధ సంస్థతో సోమవారం చంద్రబాబుకు నోటీసులు పంపించనున్నారని శివాజి జోస్యం చెప్పారు. ఆపరేషన్ ఆకర్ష్ ను మరోవిధంగా అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలతో కనెక్ట్ అయిన చంద్రబాబును ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఇంతత దారుణంగా రాజ్యాంగబద్ధ సంస్థలను వాడుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. జగన్ పైన ఇటువంటి కుట్రలు చేసినా తాను ఇలానే స్పందిస్తానని స్పష్టం చేశారు.
Next Story

