Tue Mar 24 2026 07:31:20 GMT+0530 (India Standard Time)
సీనియర్ నేతలపై బాబు సీరియస్

అమరావతిలో ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. సీనియర్ నేతలు కూడా సీరియస్ లేకుండా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు కొందరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల తీరు ఆశించిన స్థాయిలో లేదని ఆయన మండిపడ్డారు. నేతల తీరు మారకుంటే రోజు వారీ సమీక్షలుంటాయని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా అందరూ ఉద్యమంలో పాల్గొనాలని ఆదేశించారు. ఉద్యమం చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 16 నుంచి నెలాఖరు వరకూ రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. జగన్, పవన్ కుట్రలను ప్రజలకు వివరించాలని సూచించారు.
Next Story

