Mon Mar 23 2026 15:27:38 GMT+0530 (India Standard Time)
ఆ సంఘటనతో అలెర్ట్ అయిన చంద్రబాబు

జగన్ పై హత్యాయత్నంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రతిపక్ష నేతతో సహా అధికార పార్టీ నేతలందరికీ భద్రత కల్పించాలని పోలీసు శాఖకు ఆదేశించింది. కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీనియర్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై జరిగిన దాడి విషయంపై మంత్రులతో చర్చించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై ఆయన మంత్రుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. జగన్ పై హత్యాయత్నం కేసులో పూర్తి వివరాలు వచ్చిన తర్వాతనే స్పందించాలని ముఖ్యమంత్రి మంత్రులను కోరినట్లు తెలుస్తోంది.
Next Story

