Tue Mar 24 2026 15:13:47 GMT+0530 (India Standard Time)
బాబు బాలయ్యను మించిపోయారే

బాలయ్య కంటే మించిన నటుడు చంద్రబాబు అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు కేవలం సెల్ఫీల కోసమే ఢిల్లీ వెళ్లినట్లు కన్పిస్తుందన్నారు. రెండేళ్ల క్రితమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లమంటే వినని చంద్రబాబు హడావిడిగా ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారన్నారు. బీజేపీ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసిందో అంత అన్యాయం చంద్రబాబు చేశారన్నారు. దీనికి మూల్యం తప్పకుండా చెల్లించుకోక తప్పదని రఘువీరా హెచ్చరించారు. తిరుపతిలో ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన 48 గంటల దీక్షలో పాల్గొన్నరఘువీరా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story

