Sun Feb 01 2026 11:34:49 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల వేళ చంద్రబాబు....ఇలా...?

పేదల ప్రజల కడుపు నింపేందుకు ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బుధవారం విజయవాడలో ఆయన మొదటి క్యాంటీన్ ప్రారంభించి పేదలతో స్వయంగా భోజనం చేశారు. మొదటి విడుతగా 25 మున్సిపాలిటీల్లో 60 క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో క్యాంటీన్ లో రోజుకు 250 నుంచి 300 మందికి రూ.5 కే అల్ఫాహారం, భోజనం అందించనున్నారు. ఇందుకోసం అక్షయపాత్ర సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మొత్తం 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.
Next Story

