Fri Jan 30 2026 10:05:51 GMT+0000 (Coordinated Universal Time)
రేపు ఉదయం 9గంటలకు అందరూ....!

కట్టుబట్టలు, నెత్తిన అప్పుతో అమరావతికి వచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్రం సహకరించకున్నా రాఫ్ట్ర అభివృద్ధి ఆగదని, ఈ నాలుగేళ్లుగా కేంద్రం సహకరించకపోగా రాష్ట్రంపై కుట్రలు, కుతంత్రాలు చేసిందని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగకూడదనే, ఎక్కడా అధైర్యపడకుండా పనిచేస్తున్నామన్నారు. రేపు రాష్ట్ర ప్రజలంతా నవ నిర్మాణ దీక్ష చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఇంట్లో ఉన్నా,ప్రయాణంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఉదయం9 గంటలకుఈ దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని సమీక్షించుకుంటామని, ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
Next Story

