Mon Mar 23 2026 09:49:00 GMT+0530 (India Standard Time)
వైసీపీ గ్రాఫ్ పెరిగింది...బాబు ఇమేజ్ తగ్గింది

జగన్ గ్రాఫ్ పెరిగిందని, చంద్రబాబు ఇమేజ్ పడిపోయిందని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏది చెబితే చంద్రబాబు అదే చేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తేనే వైసీపీ కంటే ఐదు లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయని, ఇక విడిగా టీడీపీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి ఖాయమని విష్ణు జోస్యం చెప్పారు. చంద్రబాబు చేస్తున్నది అధర్మ పోరాటమని, ధర్మపోరాటం కాదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై పదిహేను రోజుల్లో సీబీఐ విచారణ కోరతామని విష్ణు కుమార్ రాజు చెప్పారు. పొత్తులపై బీజేపీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
Next Story

