రాజధాని కట్టమంటే తెలుగుజాతికే నష్టం
వైసీపీ ప్రభుత్వ విధానాలతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తణుకులో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏమయిపోతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రతి [more]

వైసీపీ ప్రభుత్వ విధానాలతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తణుకులో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏమయిపోతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రతి పనికీ డబ్బులు లేవని చెబుతున్నారని, సంపదను సృష్టించడం జగన్ ప్రభుత్వానికి తెలియదని చంద్రబాబు తెలిపారు. సంపద సృష్టిస్తే ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని తెలిపారు.
అమరావతి నిర్మాణాన్ని….
అమరావతి రాజధాని నిర్మాణాన్ని గందరగోళంలో పడేశారన్నారు. అమరావతిని సక్రమంగా వినియోగించుకుంటే లక్ష కోట్ల ఆదాయం వచ్చేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ముందుకు పోవడం లేదన్నారు. రాజధాని అవసరంలేదని, తము కట్టమని వైసీపీ నేతలు చెప్పడమేంటని ప్రశ్నించారు. రాజధాని వీరికోసం కాదని ప్రజలకోసమని చంద్రబాబు తెలిపారు. ఏపీ ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు మండిపడ్డారు. ఇది ఒక మూర్ఖమైన ప్రభుత్వమన్నారు. ఇసుక వారోత్సవాలు పూర్తవుతున్నా ఇసుక దొరకడం లేదంటున్నారు. ఎవరూ వ్యాపారాలు చేసుకోవడనికి వీలులేకుండా చేస్తామంటున్నారన్నారు.