ఎమ్మెల్యేల విషయంలో బాబుకు బిగ్ రిలీఫ్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్షకు ఎమ్మెల్యేల హాజరీతో కొంత టీడీపీ కుదుటపడినట్లయింది. విజయవాడలో ఇసుక కొరతకు నిరసనగా చంద్రబాబు చేపట్టిన దీక్షకు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే [more]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్షకు ఎమ్మెల్యేల హాజరీతో కొంత టీడీపీ కుదుటపడినట్లయింది. విజయవాడలో ఇసుక కొరతకు నిరసనగా చంద్రబాబు చేపట్టిన దీక్షకు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే [more]

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్షకు ఎమ్మెల్యేల హాజరీతో కొంత టీడీపీ కుదుటపడినట్లయింది. విజయవాడలో ఇసుక కొరతకు నిరసనగా చంద్రబాబు చేపట్టిన దీక్షకు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరుకాలేదు. వీరిలో గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, గణబాబులు మాత్రం హాజరుకాలేదు. వీరిలో గంటా శ్రీనివాసరావు కావాలని డుమ్మా కొట్టగా, మిగిలిన ఇద్దరూ సొంత పనుల కోసం హాజరుకాలేకపోతున్నామని పార్టీకి సమాచారం ఇచ్చారు. వల్లభనేని వంశీ ఎటూ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన హాజరుకాలేదు. 23 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది పార్టీని వీడుతారన్న ఆందోళన నేపథ్యంలో చంద్రబాబు దీక్షకు అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు హాజరుకావడంతో కొంత ఊరట లభించినట్లయింది.
బ్రేక్ ఫాస్ట్ మీటింగ్…..
చంద్రబాబు ఈరోజు ఎమ్మెల్యేలతో బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలు కూడా బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు హాజరుకానున్నారు. ఆ తర్వాత చంద్రబాబు పార్లమెంటు సభ్యులతో భేటీ కానున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీని వీడతారని ప్రచారం జరుగుతున్న కరణం బలరాం, గొట్టి పాటి రవికుమార్ లు సయితం దీక్షకు హాజరయ్యారు.

