Mon Dec 22 2025 12:53:29 GMT+0000 (Coordinated Universal Time)
నేను అధికారంలో ఉండి ఉంటే కరోనాను
జగన్ ఎప్పటికీ ఫేక్ ముఖ్యమంత్రిగానే మిగిలిపోతారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో విపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ పాలనపై దుష్ప్రచారం [more]
జగన్ ఎప్పటికీ ఫేక్ ముఖ్యమంత్రిగానే మిగిలిపోతారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో విపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ పాలనపై దుష్ప్రచారం [more]

జగన్ ఎప్పటికీ ఫేక్ ముఖ్యమంత్రిగానే మిగిలిపోతారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో విపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ పాలనపై దుష్ప్రచారం చేయడానికే అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక లక్షల సంఖ్యలో పింఛన్లను తొలగించారని, టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల పింఛన్లను తొలగించారని చంద్రబాబు ఆరోపించారు. తాము అధికారంలో ఉండి ఉంటే కరోనాను కట్టడి చేసి ఉండేవాళ్లమని చంద్రబాబు చెప్పారు. తాను కరోనాకు భయపడి పారిపోతున్నానని అనడం సరికాదని చంద్రబాబు అన్నారు.
Next Story