Tue Mar 24 2026 14:07:23 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు రెస్పాన్స్ నేడు ఎలా ఉండనుందో?
టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ కు చంద్రబాబు ఇచ్చిన 48 గంటల డెడ్ లైన్ ఈరోజు సాయంత్రంతో ముగియనుంది. అమరావతి [more]
టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ కు చంద్రబాబు ఇచ్చిన 48 గంటల డెడ్ లైన్ ఈరోజు సాయంత్రంతో ముగియనుంది. అమరావతి [more]

టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ కు చంద్రబాబు ఇచ్చిన 48 గంటల డెడ్ లైన్ ఈరోజు సాయంత్రంతో ముగియనుంది. అమరావతి రాజధాని తరలింపుపై అసెంబ్లీని రద్దుచేసి తిరిగి ప్రజాతీర్పును కోరాలని చంద్రబాబు జగన్ కు సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు ప్రకటన దేనిపై ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యేలు ముందుగా రాజీనామాలు చేయాలని వైసీపీ నేతలు ఇచ్చిన రివర్స్ ఛాలెంజ్ కు చంద్రబాబు రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
Next Story