Wed Jan 14 2026 05:19:55 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వానిదే బాధ్యత… ఛస్తున్నా పట్టించుకోరే
శానిటైజర్ తాగి పది మంది మృతి చెందిన సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కురిచేడులో జరిగిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. 14 [more]
శానిటైజర్ తాగి పది మంది మృతి చెందిన సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కురిచేడులో జరిగిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. 14 [more]

శానిటైజర్ తాగి పది మంది మృతి చెందిన సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కురిచేడులో జరిగిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. 14 నెలల నుంచి రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నాటుసారా, కల్తీ మద్యంతో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుందన్నారు. కురిచేడు మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీలో మద్యం ధరలను 300 శాతానికి పెంచడంతోనే కొందరు నాటుసారాను ఆశ్రయిస్తున్నారన్నారు.
Next Story