Thu Jan 15 2026 05:06:15 GMT+0000 (Coordinated Universal Time)
నేడు క్లారిటీ ఇవ్వనున్న చంద్రబాబు
నేడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా మహానాడు నిర్వహణపై ఈ సమావేశంలో స్పష్టత [more]
నేడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా మహానాడు నిర్వహణపై ఈ సమావేశంలో స్పష్టత [more]

నేడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా మహానాడు నిర్వహణపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశముంది. మహానాడును నిర్వహించాలా? వద్దా? అన్న దానిపై నేడు చంద్రబాబు పొలిట్ బ్యూరో లో చర్చించనున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు మహానాడును జూమ్ యాప్ ద్వారా నిర్వహించవచ్చని తెలుస్తోంది. మహానాడును గత ఏడాది కూడా నిర్వహించకపోవడంతో ఈ ఏడాది నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో పాటు మద్యం దుకాణాలు, విద్యుత్తు ఛార్జీల పెంపు, విశాఖ గ్యాస్ లీక్ సంఘటన వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు.
Next Story