విజయసాయిరెడ్డి ఎక్కడ దాక్కున్నాడు?
విశాఖ గ్యాస్ లీక్ ఘటన తర్వాత విజయసాయిరెడ్డి ఎక్కడకు వెళ్లారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఎల్జీ [more]
విశాఖ గ్యాస్ లీక్ ఘటన తర్వాత విజయసాయిరెడ్డి ఎక్కడకు వెళ్లారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఎల్జీ [more]

విశాఖ గ్యాస్ లీక్ ఘటన తర్వాత విజయసాయిరెడ్డి ఎక్కడకు వెళ్లారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో విజయసాయరెడ్డికి సంబంధాలున్నాయన్నారు. ఆయన తన ట్రస్ట్ కు ఆ కంపెనీ నుంచి విరాళాలు కూడా సేకరించారన్నారు. అందుకే ఎల్జీ కంపెనీపై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తుందన్నారు. స్టైరిన్ ఉత్పత్తికి టీడీపీ ప్రభుత్వం అనుమతిచ్చిందని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు అండగా నిలిచిన టీడీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు చంద్రబాబు. వెంటనే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్తు ఛార్జీలను ఈ సమయంలో పెంచడమేంటని చంద్రబాబు ప్రవ్నించారు.