Tue Mar 17 2026 05:06:59 GMT+0530 (India Standard Time)
వారికి అన్యాయం చేయకండి.. జగన్ కు బాబు లేఖ
మాజీ ప్రభుత్వోద్యోగులకు పించన్ల లో కోత విధించవద్దని ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వయసు ఎక్కువగా ఉండటంతో వారిపై కరోనా వైరస్ [more]
మాజీ ప్రభుత్వోద్యోగులకు పించన్ల లో కోత విధించవద్దని ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వయసు ఎక్కువగా ఉండటంతో వారిపై కరోనా వైరస్ [more]

మాజీ ప్రభుత్వోద్యోగులకు పించన్ల లో కోత విధించవద్దని ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వయసు ఎక్కువగా ఉండటంతో వారిపై కరోనా వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతుందన్నారు. అందుకోసం గత నెలలో మాదిరిగా పింఛన్లలో కోత విధించవద్దని, వారికి పూర్తి పింఛను ఇచ్చేయాలని చంద్రబాబు జగన్ ను కోరారు. అలాగే మరో లేఖను చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాశారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలు, వాటి కొనుగోళ్లపై తనకు సమాచారం ఇవ్వాలని చంద్రబాబు సీఎస్ ను కోరారు. మండలాల వారీగా పంటల ఉత్పత్తుల వివరాలు, వాటి కొనుగోళ్లకు సంబంధించి తనకు నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కోరారు.
Next Story