ఆ వైద్యుడి సస్పెన్షన్ సరికాదు…. జగన్ కు లేఖ
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మరో లేఖ రాశారు. నర్సీపట్నం ఎనస్తీషియా వైద్యుడు సుధాకర్ ను సస్పెండ్ చేయడం సరికాదని చంద్రబాబు [more]
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మరో లేఖ రాశారు. నర్సీపట్నం ఎనస్తీషియా వైద్యుడు సుధాకర్ ను సస్పెండ్ చేయడం సరికాదని చంద్రబాబు [more]

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మరో లేఖ రాశారు. నర్సీపట్నం ఎనస్తీషియా వైద్యుడు సుధాకర్ ను సస్పెండ్ చేయడం సరికాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వైద్యులకు సరైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పించడం లేదని చెప్పడం నేరమెలా అవుతుందని చంద్రబాబు లేఖలో ప్రశ్నించారు. సుధాకర్ ను ఈ పరిస్థితుల్లో సస్పెండ్ చేస్తే వైద్యులు, వైద్య సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతింటుందన్నారు. ఇప్పటికైనా డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్ ను ఎత్తివేయాని చంద్రబాబు లేఖలో కోరారు. అలాగే పేదలను ఆకలిని తీర్చే అన్నా క్యాంటిన్లు తిరిగి తెరవాలని చంద్రబాబు కోరారు. చంద్రన్న బీమా పథకాన్ని కూడా పునరుద్ధిరించాలని కోరారు. విధ్వసం చేసే వారు చరిత్రలో తెరమరుగవుతారని చంద్రబాబు ఈ లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

