కోర్టులు చీవాట్లు పెట్టినా..?
స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టును వైసీపీ ఇప్పటికీ వక్రీకరిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. చేసిన తప్పును మళ్లీ కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తుందన్నారు. అసలు స్థానిక [more]
స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టును వైసీపీ ఇప్పటికీ వక్రీకరిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. చేసిన తప్పును మళ్లీ కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తుందన్నారు. అసలు స్థానిక [more]

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టును వైసీపీ ఇప్పటికీ వక్రీకరిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. చేసిన తప్పును మళ్లీ కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తుందన్నారు. అసలు స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. కరోనా వైరస్ వల్లనే ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందని సుప్రీంకోర్టు సయితం అభిప్రాయపడింద న్నారు. అధికారంలో ఉన్న వ్యక్తులు రాజ్యాంగ వ్యవస్థలను కించపర్చేలా వ్యవహరించారన్నారు. స్పీకర్ సయితం కులాల ప్రస్తావన తీసుకువచ్చి సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణులు చేశారు. ఈ ప్రభుత్వానికి న్యాయస్థానాలు ఎన్ని చీవాట్లు పెట్టినా బుద్ధి రావడం లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇకనైనా రాజకీయాలు మానుకుని కరోనా వైరస్ పై దృష్టి పెట్టాలని చంద్రబాబు కోరారు.