Mon Dec 08 2025 14:52:51 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : గంట నుంచి చంద్రబాబు కదలకుండా?
విశాఖ ఎయర్ పోర్టులోనే చంద్రబాబు ఉండిపోయారు. దాదాపు 11.15 నిమిషాలకు చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాగానే వైసీపీ [more]
విశాఖ ఎయర్ పోర్టులోనే చంద్రబాబు ఉండిపోయారు. దాదాపు 11.15 నిమిషాలకు చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాగానే వైసీపీ [more]

విశాఖ ఎయర్ పోర్టులోనే చంద్రబాబు ఉండిపోయారు. దాదాపు 11.15 నిమిషాలకు చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాగానే వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆయన కాన్వాయ్ ముందుకు కదలలేదు. పెద్దయెత్తున నిరసనకారులు విశాఖ ఎయిర్ పోర్టు ఉండటంతో వారిని పక్కకు తొలగించడం కూడా పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. కొందరిని తొలగిస్తుండగా మరికొందరు కాన్వాయ్ కు వచ్చి అడ్డం పడుకుంటున్నారు. దీంతో గంట సేపు నుంచి చంద్రబాబు ఎయిర్ పోర్టు బయటే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో వెయిట్ చేయలేక కాన్వాయ్ ను వదిలేసి చంద్రబాబు పాదయాత్రగా బయటకు వచ్చారు.
Next Story