Mon Dec 08 2025 12:39:42 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కీలక భేటీ
టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్ నేతలతో భేటీ కానున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు టీడీపీ నేతలతో భేటీ అయి చర్చించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో రెండు [more]
టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్ నేతలతో భేటీ కానున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు టీడీపీ నేతలతో భేటీ అయి చర్చించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో రెండు [more]

టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్ నేతలతో భేటీ కానున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు టీడీపీ నేతలతో భేటీ అయి చర్చించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించిన చంద్రబాబు ఈరోజు నేతలతో జరిగే సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు. ఈఎస్ఐ స్కామ్, స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఏర్పాటు తదితర అంశాలపై చంద్రబాబు చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై కూడా సమాలోచనలు చేయనున్నారు. టీడీపీ నేతలపై నమోదవుతున్న కేసుల విషయంలో న్యాయపరంగా వెళ్లాలని ఇప్పటికే చంద్రబాబు డిసైడ్ అయిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story