ఈరోజు కూడా అంతేనా?
కాసేపట్లో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి చంద్రబాబు హాజరుకానున్నారు. అక్కడి నుంచి నేరుగా మచిలీపట్నంకు వెళ్లి అక్కడ జరిగే బహిరంగ సభలో [more]
కాసేపట్లో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి చంద్రబాబు హాజరుకానున్నారు. అక్కడి నుంచి నేరుగా మచిలీపట్నంకు వెళ్లి అక్కడ జరిగే బహిరంగ సభలో [more]

కాసేపట్లో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి చంద్రబాబు హాజరుకానున్నారు. అక్కడి నుంచి నేరుగా మచిలీపట్నంకు వెళ్లి అక్కడ జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. అయితే బెంజిసర్కిల్ లో ఉన్న అమరావతి పరిరక్షణ కార్యాలయానికి పోలీసులు తాళాలు వేశారు. బస్సు యాత్రకు వెళ్లాల్సిన బస్సులను కూడా సీజ్ చేశారు. బస్సు యజమానులకు కూడా నోటీసులు అందజేశారు. ఈరోజు తిరిగి బస్సుయాత్రను చంద్రబాబు ప్రారంభించాలని రెడీ అవుతున్నారు. కానీ పోలీసులు అనుమతి ఇస్తారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. నిన్న బెంజిసర్కిల్ లో మూడు గంటల పాటు హైడ్రామా నడిచింది. ఈరోజు కూడా పోలీసులు అడ్డుకుంటే మరోసారి జేఏసీ, పోలీసులు మధ్య వివాదం తలెత్తే అవకాశముంది.