జగన్ చట్టాలు చెల్లవ్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. బొత్స సత్యనారాయణ అమరావతిని స్మశానంలో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. బొత్స సత్యానారాయణను వెంటనే [more]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. బొత్స సత్యనారాయణ అమరావతిని స్మశానంలో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. బొత్స సత్యానారాయణను వెంటనే [more]

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. బొత్స సత్యనారాయణ అమరావతిని స్మశానంలో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. బొత్స సత్యానారాయణను వెంటనే మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ ఇన్నాళ్లూ స్మశానంలోకూర్చుని పాలన చేస్తున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ నవరత్నాలన్నీ నవ భూతాలేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజా దేవాలయంలాంటి అమరావతిని స్మశానంతో పోలుస్తారా? అని నిలదీశారు. ఇంగ్లీష్ మీడియం పెట్టమని ఎవరు కోరరాన్నారు. రాష్ట్రంలో్ జగన్ చట్టాలు చెల్లవని చెప్పారు. శాసనసభ మాత్రమే చట్టాలను చేస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. పనిచేయడం చేతకాక ఎదురుదాడి చేస్తారా? అని ప్రశ్నించారు చంద్రబాబు.