Tue Mar 24 2026 02:51:35 GMT+0530 (India Standard Time)
Chandrababu : బాబుకు దొరకని షా… తిరుగు ప్రయాణం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. అమిత్ షా, ప్రధాని మోదీ అపాయింట్ మెంట్లు దొరకకపోవడంతో చంద్రబాబు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. అమిత్ షా, ప్రధాని మోదీ అపాయింట్ మెంట్లు దొరకకపోవడంతో చంద్రబాబు [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. అమిత్ షా, ప్రధాని మోదీ అపాయింట్ మెంట్లు దొరకకపోవడంతో చంద్రబాబు తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. ఏపీలో ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం చంద్రబాబు గత కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం లేదు.
గదిలోనే…..
సోమవారం రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలిసిన తర్వాత చంద్రబాబు ఢిల్లీలో హోటల్ లోనే కాలం గడిపారు. అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకక పోవడంతో తిరిగి బయలుదేరారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కూడా తిరుగు ప్రయాణమయ్యారు.
Next Story