Wed Jan 28 2026 21:03:06 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేతలతో చంద్రబాబు కీలక భేటీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఉండవల్లి లోని తన నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. 36 గంటల దీక్షకు వచ్చిన రెస్పాన్స్, సోమవారం [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఉండవల్లి లోని తన నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. 36 గంటల దీక్షకు వచ్చిన రెస్పాన్స్, సోమవారం [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఉండవల్లి లోని తన నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. 36 గంటల దీక్షకు వచ్చిన రెస్పాన్స్, సోమవారం తన ఢిల్లీ టూర్ పై చంద్రబాబు సీనియర్ నేతలతో చర్చిస్తున్నట్లు తెలిసింది. సోమవారం రాష్ట్రపతి భేటీ తర్వాత ఎవరెవరిని కలవాలన్న దానిపై కూడా చంద్రబాబు నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. మోదీ, షా అపాయింట్ మెంట్ దొరకకపోతే ఏం చేయాలన్న దానిపై కూడా చంద్రబాబు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడితో పాటు మరికొందరు సీనియర్ నేతలు హాజరయ్యారు.
Next Story