Thu Mar 26 2026 21:33:00 GMT+0530 (India Standard Time)
భావోద్వేగానికి గురయిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదనకు గురయ్యారు. తాను ఏం తప్పు చేశానో తనకే తెలియడం లేదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి చెందాలనుకోవడం తాను [more]
టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదనకు గురయ్యారు. తాను ఏం తప్పు చేశానో తనకే తెలియడం లేదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి చెందాలనుకోవడం తాను [more]

టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదనకు గురయ్యారు. తాను ఏం తప్పు చేశానో తనకే తెలియడం లేదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి చెందాలనుకోవడం తాను చేసిన తప్పా? అని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివయిన పోలవరం, అమరావతిని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని చంద్రాబాబు మండిపడ్డారు. ఈ ప్రభుత్వం పన్నులు వేయడానికి, అప్పులు పెంచడానికి మాత్రమే పనిచేస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని చంద్రబాబు అన్నారు. జగన్ చెప్పిన మాయ మాటలు నమ్మి ప్రజలు పూనకం వచ్చిన వారిలా ఓట్లు వేశారన్నారు. ఇప్పుడు అందరం అనుభవించాల్సి వస్తుందని చంద్రబాబు ఆవేదన చెందారు.
Next Story