చంద్రబాబు ఇక రెడీ అయిపోయారు...!

రాష్ట్రంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యంత్రాంగంలో సమూల మార్పులకు చంద్రబాబు సర్కార్ శ్రీకారం చుట్టింది. దీర్ఘ కాలంగా ఒకే చోట వున్న వారిని, అలాగే అవసరమనుకున్న చోట సమర్థులకు బాధ్యతలు అప్పగించింది. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో పాలనలో వేగం పెంచడం పై ప్రభుత్వం దృష్టి నిలిపింది. అందులో భాగంగా ప్రక్షాళన మొదలు పెట్టింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పలు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టే కన్పిస్తోంది.
కొత్త బాధ్యతలు తీసుకుంటున్న వారు వీరే ...
విజయనగరం కలెక్టర్ గా హరి జవహర్ లాల్
జాయింట్ కలెక్టర్ గా కె వెంకట రమణారెడ్డి
కడప జిల్లా కలెక్టర్ గా చేవూరు హరి కిరణ్
జాయింట్ కలెక్టర్ టి నాగరాణి
అనంతపురం జాయింట్ కలెక్టర్ ఢిల్లీ రావు
పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల రెడ్డి
రాజమహేంద్రవరం మునిసిపల్ కమిషనర్ గా సుమిత్ కుమార్
తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ వైస్ ఛైర్మెన్ గా విజయరామరాజు
జీఏడీ ముఖ్య కార్యదర్శిగా కె. ప్రవీణ్ కుమార్
ఆర్థికశాఖ కార్యదర్శిగా పీయూష్ కుమార్
విద్యాశాఖ ఉపకార్యదర్శి హర్షవర్ధన్
వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ మురళీధర్ రెడ్డి
వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి టికె రామా మణి
సీసీఎల్సీ కార్యదర్శి విజయ కుమార్
జాయింట్ సెక్రెటరీ ఎన్ ప్రభాకర రెడ్డి
ఎపిపిఎస్సి కార్యదర్శి పి. కోటేశ్వర్
మైనారిటీ సంక్షేమ కార్యదర్శి రామ్ గోపాల్
గిరిజన సహకార కార్పొరేషన్ ఎండి బాబురావు నాయుడు
బిసి సహకార ఆర్ధిక అభివృద్ధి కార్పొరేషన్ ఎండి బి బాబురావు
ఎస్సి సహకార ఆర్ధిక సంస్థ ఎండి గా వివేక్ యాదవ్
స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ ఎండి మురళీధర్ రెడ్డి
హస్త కళల అభివృద్ధి ఎండి వెంకటేశ్వర్లు
