జగన్ పొలిటికల్ టెర్రరిజం సృష్టిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పొలిటికల్ టెర్రరిజం సృష్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఫైర్ అయ్యారు. జగన్ అహంభావిగా ప్రవర్తిస్తున్నారన్నారు. పచ్చి అబద్ధాలు చెబుతూ సభను [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పొలిటికల్ టెర్రరిజం సృష్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఫైర్ అయ్యారు. జగన్ అహంభావిగా ప్రవర్తిస్తున్నారన్నారు. పచ్చి అబద్ధాలు చెబుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు మీడియా తో మాట్లాడుతూ రైతులకు గత ప్రభుత్వ హయాంలో వడ్డీతో సహా చెల్లించామని చెప్పారు. కానీ జగన్ మాత్రం వడ్డీ చెల్లించలేదని అబద్దాలు చెబుతున్నారన్నారు. వైసీపీ తీరు బాధాకరమని చెప్పారు. వైఎస్ జగన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసినందుకు ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీని అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఎమ్మెల్యేలు అసభ్యంగా మాట్లాడుతున్నారని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులను, హోంగార్డులలను బెదిరిస్తున్నారన్నారు.