Tue Mar 24 2026 16:52:26 GMT+0530 (India Standard Time)
మోదీ పని అయిపోయింది..!

బీజేపీ పని అయిపోయిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ఘన విజయం సాధించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. లక్ష ఓట్ల మెజారిటీ వచ్చిందంటే బీజేపీకి ఏ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు, ఈ ఉప ఎన్నికలకు ఎంత తేడా ఉందన్నది అర్థమవుతుందన్నారు. దేశ వ్యాప్తంగా మోదీ ఇమేజ్ పడిపోవడంతో పాటు బీజేపీ గ్రాఫ్ కూడా కిందకు పడిపోయిందన్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఉన్న నిదర్శనమన్నారు. ప్రజలకు బీజేపీకి ఎంతదూరమవుతున్నారన్న దానికి ఈఫలితాలే సంకేతమన్నారు. రాజకీయాలు రోజురోజుకూ మారిపోతున్నాయన్నారు. అతివిశ్వాసం, అహంభావంతో ఉంటే ఇలాగే జరుగుతుందని పరోక్షంగా మోదీపై విమర్శలు గుప్పించారు.
Next Story

