Tue Mar 24 2026 06:33:08 GMT+0530 (India Standard Time)
ఎయిర్ పోర్టులో దిగగానే...

దేశ శ్రేయస్సు కోసం జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను కలపడమే లక్ష్యంగా ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా బిజీ ఉన్నారు. ఆయన గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో దిగగానే ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ ముఖ్య నేత గులాం నబీ ఆజాద్ తో భేటీ అయ్యి మంతనాలు జరిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. తర్వాత ఆయన శరద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లాను కూడా కలిసే అవకాశం ఉంది.
Next Story

