Sat Mar 21 2026 00:40:30 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం

రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వాహనదారులకు కొంత ఊరట కల్పించాలని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పెట్రో ధరలపై వ్యాట్ తగ్గించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం పెట్రోల్ ధరలపై లీటరుకు రూ.4 చొప్పులు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వసూలు చేస్తుండగా... దీనిని రూ.2కి తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేయనున్నారు.
Next Story

