గురువుకే నామాలు పెట్టిన ఘనుడాయన
తాను ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచానని మోడీ విమర్శిస్తున్నారని, కానీ రాజకీయ గురువు అడ్వానీకే నామాలు పెట్టిన ఘనుడు నరేంద్ర మోడీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు [more]
తాను ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచానని మోడీ విమర్శిస్తున్నారని, కానీ రాజకీయ గురువు అడ్వానీకే నామాలు పెట్టిన ఘనుడు నరేంద్ర మోడీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు [more]

తాను ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచానని మోడీ విమర్శిస్తున్నారని, కానీ రాజకీయ గురువు అడ్వానీకే నామాలు పెట్టిన ఘనుడు నరేంద్ర మోడీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. తాను ఎన్టీఆర్ను విభేదించి పార్టీని కాపాడానని పేర్కొన్నారు. తనను తిట్టడానికే మోడీ ఢిల్లీ నుంచి వచ్చారని… తిట్టి పారిపోయారని, రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేకపోయారని అన్నారు. మోడీ సభకు జనం రారని తెలిసే వైసీపీ వారు జనసమీకరణ చేశారని ఆరోపించారు. జగన్ మెడపై సీబీఐ కత్తి వేలాడుతోందని, అందుకే బీజేపీతో లాలూచీ పడ్డారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే మరో 15 సీట్లు అదనంగా వచ్చేవని ఆయన అన్నారు. తాను ఏ విషయంలోనూ యూటర్న్ తీసుకోలేదని, రైట్ టర్న్ తీసుకున్నానని స్పష్టం చేశారు.