Tue Mar 24 2026 06:32:51 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రాహుల్ గాంధీ ఇంటికి చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లారు. ఉదయం గులాం నబీ ఆజాద్, ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్ తో భేటీ అయిన చంద్రబాబు ఇప్పుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఇక నుంచి కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాహుల్ తో భేటీకి చంద్రబాబు వెంట ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేష్, కనకమేడల ఉన్నారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేత కొప్పుల రాజు ఈ భేటీతో పాల్గొన్నారు.
Next Story

