Sun Feb 01 2026 21:13:45 GMT+0000 (Coordinated Universal Time)
అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ రాజంపేట, కడప జిల్లాల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంటు పరిధిలోని [more]
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ రాజంపేట, కడప జిల్లాల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంటు పరిధిలోని [more]

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ రాజంపేట, కడప జిల్లాల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంటు పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఆయన ఫైనల్ చేశారు. రాజంపేట అభ్యర్థిగా చెంగల్రాయుడు, రాయచోటి అభ్యర్థిగా రమేశ్ కుమార్ రెడ్డి, పీలేరు అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు అభ్యర్థిగా అనూషరెడ్డి, రైల్వే కోడూరుకు నరసింహప్రసాద్ అభ్యర్ధిత్వాలను చంద్రబాబు ఖరారు చేశారు. మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాలపైనా సమీక్ష జరిపినా అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు.
Next Story