Tue Mar 24 2026 03:00:25 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : చంద్రబాబు దీక్ష 20న

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రోజు దీక్షకు దిగనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ చంద్రబాబు ఈ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. అదే రోజు చంద్రబాబు పుట్టిన రోజు కావడం విశేషం. తన పుట్టిన రోజు నాడే ఏపీకి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా దీక్ష చేపడుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఆరోజంతా దీక్షలోనే చంద్రబాబు ఉంటారు. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకే దీక్ష చేపట్టినట్లు చెబుతున్నారు. నరేంద్రమోడీ మొన్న ఒకరోజు దీక్ష చేశారని, అయితే ఆయన పార్లమెంటు జరగనందుకు దీక్ష చేశారని, తాను ఏపీకి జరుగుతున్న అన్యాయంపైనే దీక్ష చేస్తున్నానని ఆయన తెలిపారు.
Next Story

