Fri Mar 27 2026 22:42:44 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు భావోద్వేగం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు గేట్ల నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈరోజు ఒక శుభదినం అని పేర్కొన్నారు. తాను జీవితంలో ఎన్నడూ లేనంత సంతోషంగా ఇవాళ ఉన్నారన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా నిర్మితమవుతున్న ప్రాజెక్టు పోలవరం అని పేర్కొన్నారు. 2019 మే నెల లోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆయన ప్రకటించారు. కేంద్రం సహకరించకపోయినా ఎంతో ధృడ సంకల్పంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 63 శాతం పనులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు.
Next Story

