Tue Mar 24 2026 06:33:08 GMT+0530 (India Standard Time)
వారు సీనియర్... నేను వారికి జూనియర్

దేశం ప్రస్తుతం క్లిష్టపరిస్థితుల్లో ఉందని... వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో ఎన్సీపీ నేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... దేశ భవిష్యత్తును కాపాడాలనే లక్ష్యంతోనే తాము భేటీ అయ్యామని పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిని చూసి తామంతా బాధపడ్డామని, అందుకే బీజేపీయేతర పక్షాలను కలపడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీతోనూ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా దేశంలోనే సీనియర్ నాయకులు చెప్పిన చంద్రబాబు, తాను వారికి జూనియర్ అని పేర్కొనడం గమనార్హం.
Next Story

