టీడీపీతో పెట్టుకున్నప్పుడే మోడీ పతనం ప్రారంభం
తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్నప్పుడే నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తులను కూడగట్టామని, నరేంద్ర మోడీ గద్దె [more]
తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్నప్పుడే నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తులను కూడగట్టామని, నరేంద్ర మోడీ గద్దె [more]

తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్నప్పుడే నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తులను కూడగట్టామని, నరేంద్ర మోడీ గద్దె దిగడం ఖాయమన్నారు. ఓటమి నైరాశ్యంతో మోడీ దిగజారి మాట్లాడుతున్నారని, ఫ్రస్ట్రేషన్ తోనే 26 ఏళ్ల క్రితం చనిపోయిన రాజీవ్ గాంధీని మోడీ విమర్శిస్తున్నారని ఆరోపించారు. ఈ ఐదేళ్లలో తానేమీ చేశానో చెప్పి ఓట్లడగాలని నరేంద్ర మోడీకి హితవు పలికారు. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే తాము కేంద్రంతో విభేదించామని స్పష్టం చేశారు. ప్రత్యర్థులపై ఐటీ, ఈడీ సంస్థలతో కక్షపూరితంగా దాడులు చేయించడం గతంలో ఎప్పుడూ లేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే తాము సుప్రీం కోర్టుకు వెళ్లామని, తమ పోరాటం వల్లే ఐదు వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించడానికి ఈసీ అంగీకరించిందని పేర్కొన్నారు. ఈ ఐదు వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపులో తేడా వస్తే ఆ నియోజకవర్గంలోని అన్ని బూత్ లలో వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలనేదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు.