Sun Mar 15 2026 19:51:16 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ వస్తే సంతోషమే..!

కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నారని... ఆయన ఏపీకి వస్తే సంతోషమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గందరగోళం, అయోమయం సృష్టించడానికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలని ఆయన ఆరోపించారు. దేశ రాజకీయాల్లో చాలా మార్పులు రాబోతున్నాయని అన్నారు. రాష్ట్రానికి ఏం చేయకుండానే మోడీ రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యర్థులంతా కలిసి ఆడుతున్న డ్రామాలను ప్రజల్లో ఎండగట్టాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. ప్రజల్లో ఈవీఎంలపై నమ్మకం రావడం లేదని, ఓటు ఎవరికి వేశామో తెలుసుకోవడం ప్రజల హక్కు అని పేర్కొన్నారు.
Next Story

