Mon Dec 08 2025 17:21:52 GMT+0000 (Coordinated Universal Time)
అక్కడ బీజేపీ ఓటమికి టీడీపీ కూడా కారణం..!

మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడటానికి తెలుగుదేశం పార్టీ కూడా కారణమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు పేర్కొన్నారు. విశాఖపట్నం తగరపువలసలో జరిగిన టీడీపీ ఆత్మీయ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ... బీజేపీని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలను తాము ఏకం చేసినందునే బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఓడిపోయిందని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ సీబీఐ, ఈడీలను ప్రత్యర్థులకు పైకి ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే జాతీయ స్థాయిలో తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. గతంలో టీడీపీలో ఉన్న కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాననడం న్యాయమా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాను వ్యతిరేకించిన కేసీఆర్ ను జగన్, పవన్ సమర్థిస్తున్నారని ఆరోపించారు.
Next Story

