Tue Mar 24 2026 18:17:12 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు స్పీడ్ పెంచారు

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే పనిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉన్నారు. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరేన్స్ నేతలను ఆయన కలిశారు. ఇక దక్షిణాధిన కూడా బీజేపీ వ్యతిరేక పక్షాలను కలిసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయన రేపు బెంగళూరు వెళ్లనున్నారు. అక్కడ జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని కలవనున్నారు. అనంతరం ఎల్లుండి ఆయన చెన్నై వెళ్లనున్నారు. అక్కడ డీఎంకే నేత స్టాలిన్ తో భేటీ అయి జాతీయ రాజకీయాలను చర్చించనున్నారు.
Next Story

