Tue Mar 24 2026 13:41:58 GMT+0530 (India Standard Time)
వైసీపీపై బాబు ఫైర్

వైసీపీ దీక్షల పేరుతో డ్రామా చేస్తుందని, బీజేపీతో కుమ్మక్కై కుట్ర రాజకీయాలు చేస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అన్ని విపక్ష పార్టీలూ ఏకమై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిన్న ఆందోళన చేస్తే వైసీపీ ఎందుకు దూరంగా ఉందో సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. టీడీపీ ఆంధ్రుల ఆత్మగౌరవం కోసమే పుట్టిందని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధించేంత వరకూ కేంద్రంపై పోరాటం తప్పదని ఆయన తెలిపారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆయన రాజధానిలో సైకిల్ యాత్రను ప్రారంభించారు.
Next Story

